Maruti Suzuki: కార్ల అమ్మకాల్లో జోరు.. భారీ లాభాలు నమోదు చేసిన టాటా, మారుతి, టయోటా
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ముగించింది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి ప్రధాన కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసి సత్తా చాటాయి.
మారుతీ సుజుకీ ఇండియా 2026 మార్చిలో 2,25,251 యూనిట్లను విక్రయించి, గతేడాదితో పోలిస్తే 16.72 శాతం వృద్ధిని సాధించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ సుమారు 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 4.47 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఇది 34 శాతం పెరుగుదల కావడం విశేషం.
మరోవైపు, టాటా మోటార్స్ తన చరిత్రలోనే అత్యధికంగా వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 6.42 లక్షల యూనిట్లను విక్రయించి 15 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోకు మంచి ఆదరణ లభించింది. ఈవీ అమ్మకాలు 43 శాతం పెరిగి 92,000 యూనిట్లు దాటాయి. సీఎన్‌జీ విభాగం కూడా 24 శాతం వృద్ధితో రాణించింది. అమ్మకాల పరంగా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో టాటా మోటార్స్ రెండో స్థానంలో నిలిచింది.
ఇదే బాటలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా 2026 ఆర్థిక సంవత్సరంలో 4,06,081 యూనిట్లను విక్రయించి 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి నెలలో కూడా 24 శాతం పెరుగుదలతో 37,194 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఎస్‌యూవీ, ఎంపీవీ, కాంపాక్ట్ సెగ్మెంట్లలో నిలకడైన డిమాండ్, కొత్త ఉత్పత్తుల విడుదల తమ వృద్ధికి కారణమని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో హైబ్రిడ్, ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తామని పేర్కొంది.