GST Revenue: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు.. తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం!
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. 2026 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం తొలిసారిగా రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటింది. ఇవాళ విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ. 1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయంగా స్థిరమైన ఆదాయంతో పాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
దిగుమతులపై పన్నుల రాబడి ఏకంగా 17.8 శాతం పెరగగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు మార్చిలో రూ. 1,77,990 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 8.2 శాతం ఎక్కువ.
మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు సానుకూల వృద్ధిని కనబరిచాయి. ఈ ఏడాది స్థూల వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ. 22.27 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఇవి రూ. 20.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7 శాతం జీడీపీ వృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో జీఎస్టీ వసూళ్లు కూడా అదే స్థాయిలో పెరగడం శుభపరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న వినియోగం, దిగుమతులు, మెరుగైన పన్నుల చెల్లింపుల వ్యవస్థ దీనికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. గత 12 నెలలుగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 1.7 లక్షల కోట్ల కంటే పైనే నమోదు కావడం గమనార్హం.