Bojja Tirupati: కరీంనగర్‌ జిల్లా హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు

Bojja Tirupati Murder Case 15 Sentenced to Life in Karimnagar
షార్ట్స్‌లో చూడండి
ఒక వ్యక్తి హత్య కేసులో 15 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ తీర్పు వెలువరించారు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడిపై బాలనేరస్థుల న్యాయస్థానంలో విచారణకు అనుమతించింది. చేపలు పట్టే విషయంలో ఏడేళ్ల క్రితం జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది.

కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ తిరుపతి గ్రామ మత్స్యకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చెరువుల వివాదంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు అతడిని హత్య చేశారు. రాళ్లతో దాడి చేసి, కండువాను మెడకు బిగించి హతమార్చారు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 19న జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం 15 మంది నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.1,500 చొప్పున జరిమానా విధించింది.
Go Back to Shorts
Bojja Tirupati
Karimnagar
Telangana
Murder Case
Life Imprisonment
Damanapalli

More Telugu News