Hyderabad Meteorological Center: తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈరోజు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రేపు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.
Hyderabad Meteorological Center
Telangana rains
Hyderabad weather
IMD Hyderabad
Telangana weather forecast

More Telugu News