Fakhar Zaman: పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో పీఎస్‌ఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఈ నెల 29న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్టు ఆన్-ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. దీంతో వెంటనే లాహోర్ ఖలందర్స్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించి, బంతిని మార్చారు.
ఈ ఘటనపై ఆన్-ఫీల్డ్ అంపైర్లు షాహిద్ సైకత్, ఫైసల్ ఖాన్ అఫ్రీదీ, టీవీ అంపైర్ ఆసిఫ్ యాకూబ్, నాలుగో అంపైర్ తారిఖ్ రషీద్‌లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. పీఎస్‌ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.14 ప్రకారం బంతి ఆకారాన్ని మార్చడం లెవల్ 3 నేరంగా పరిగణిస్తారు. అయితే, ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా, విచారణను కోరాడు.
దీంతో మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా ఆధ్వర్యంలో అధికారిక విచారణ జరిగింది. ఈ విచారణకు ఫఖర్ జమాన్‌తో పాటు లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షహీన్ అఫ్రిది, జట్టు డైరెక్టర్ సమీన్ రాణా, మేనేజర్ ఫరూఖ్ అన్వర్ హాజరయ్యారు. ఫఖర్ వాదనలను విన్నప్పటికీ, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత అతన్ని దోషిగా నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ, రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఖరారు చేశారు.
ఈ నిషేధం కారణంగా ఫఖర్ జమాన్.. ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్‌తో గడ్డాఫీ స్టేడియంలో, ఏప్రిల్ 9న కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగే కీలక మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ స్టార్ ఓపెనర్ సేవలను కోల్పోవడం లాహోర్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.