Usha Vance: ప్రతి పనిలో నా భర్తకు సాయం చేయాలనుకుంటా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష
ప్రతి పనిలోనూ నా భర్తకు అండగా ఉండి సాయం చేయాలనుకుంటానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ వెల్లడించారు. ఆయనకు సాయంగా ఉండాలనుకుంటాను కాబట్టి ఆయన ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని అన్నారు. తన భర్త దేనిపై దృష్టి పెట్టాడు, ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. తమది వివాహ బంధం కాబట్టి ఆయనకు సాయంగా ఉండాలని అన్నారు.
ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియకపోతే సాయం చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. అందుకే ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. నచ్చని విషయంలో భర్తతో తాను అస్సలు ఏకీభవించనని స్పష్టం చేశారు. ఒక్కోసారి ఆ నిర్ణయాలు కూడా విశాల దృక్పథంతో ఆలోచించేలా చేస్తాయని అన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
జేడీ వాన్స్‌కు తాను ఒక నమ్మకమైన సలహాదారుగా వ్యవహరిస్తానని అన్నారు. వ్యక్తిగత విషయాల్లో తన భర్త తన అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకుంటారని చెప్పారు. తన భర్త చుట్టూ ఎంతోమంది సలహాదారులు, సిబ్బంది ఉన్నారని, వారంతా ఇబ్బందిపెట్టే అంశాలు, వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి తవ వద్దకే వస్తారని ఆమె తెలిపారు.
అయితే తాను సహోద్యోగిని కాదని, అనవసర విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య ఒకేరకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదని అన్నారు. ఏదీ దాచుకోకుండా స్వేచ్ఛాయుతంగా ఎవరి అభిప్రాయాలను వాళ్లు పంచుకుంటామని అన్నారు.