Sandeep Tomar: భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో... గ్యాస్ బుకింగ్‌తో పట్టుబడిన వ్యక్తి
భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ఒక వ్యక్తి గ్యాస్ బుకింగ్ చేసి పోలీసులకు పట్టుబడిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సందీప్ తోమర్ అనే మాజీ ఆర్మీ కెప్టెన్ 2013లో పంజాబ్‌లోని అబోహర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన భార్యను హత్య చేశాడు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, విచారణలో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
భార్య హత్య కేసులో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి, 2014లో జీవితఖైదు విధించింది. 2019లో అతడికి బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. అప్పీలును 2022లో హైకోర్టు కొట్టివేసినప్పటికీ అతడు లొంగిపోలేదు. అప్పటి నుంచి తన గుర్తింపు, లొకేషన్లు మార్చుతూ తప్పించుకుని తిరుగుతున్నాడు. సందీప్ తోమర్‌ను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు.
అతడి పాన్‌కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ అకౌంట్ ద్వారా తోమర్ మధ్యప్రదేశ్‌లోని పాండుర్నాలో ఒక ఎల్పీజీ గ్యాస్ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించిన పోలీసులు అతడి వివరాలు తెలుసుకున్నారు. పాండుర్నాలో అతడిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.