Kakani Govardhan Reddy: బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కాకాణిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వారనే ఆరోపణలతో పాటు, అడ్డుకున్న గిరిజనులను కులం పేరుతో దూషించారని కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో గత ఏడాది ఆగస్టు 18న హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని షరతులు విధించింది.
అయితే, కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశాలు నిర్వహించి, ఈ కేసులో సాక్షిగా ఉన్న పిటిషనర్ సోమిరెడ్డితో పాటు ఇతర సాక్షులను బెదిరిస్తున్నారని సోమిరెడ్డి తరఫు న్యాయవాది కె.పల్లవి కోర్టుకు తెలిపారు. ఇది కోర్టు విధించిన బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని, అందువల్ల ఆయన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కాకాణిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.