Vaibhav Suryavanshi: పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ
స్వల్ప లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించాలనే స్పష్టమైన ప్రణాళికతోనే బరిలోకి దిగామని రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడవ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
మ్యాచ్ అనంతరం సూర్యవంశీ మాట్లాడుతూ.. "128 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా, పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లు పట్టు సాధిస్తే మ్యాచ్ మలుపు తిరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. తొలుత పిచ్ కాస్త స్టిక్కీగా అనిపించినా, బంతి పాతబడ్డాక బ్యాట్‌పైకి చక్కగా వచ్చింది" అని వివరించాడు. తన సహజ సిద్ధమైన ఆట ఆడమని కోచ్‌లు సూచించారని, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రతి బంతికీ సూచనలిస్తూ ప్రోత్సహించాడని తెలిపారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ను రాజస్థాన్ బౌలర్లు 127 పరుగులకే కట్టడి చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నాండ్రే బర్గర్ (2/26) మాట్లాడుతూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కలిసివచ్చిందని చెప్పాడు. టైట్ లైన్స్‌తో బౌలింగ్ చేసి బ్యాటర్లపై ఒత్తిడి తేవాలన్న తమ ప్రణాళిక ఫలించిందన్నాడు. కాగా, 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. సూర్యవంశీ మెరుపులతో కేవలం 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.