Mohammad Safa: ఇరాన్‌పై అణుదాడికి సన్నాహాలు?.. ఐక్యరాజ్యసమితిలో పదవికి రాజీనామా చేసిన దౌత్యవేత్త!
ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త మహమద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ, సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితిలోని ఓ వర్గం మద్దతు ఇస్తోందని, ఈ మానవత్వ వ్యతిరేక నేరంలో తాను భాగస్వామిని కాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో ఒక లేఖ ద్వారా ఆయన వెల్లడించారు.
"ఇరాన్‌పై అణుదాడికి ఐక్యరాజ్యసమితి 'సహకారం' అందిస్తోందన్న విషయాన్ని ప్రజలు గ్రహించడం లేదు. టెహ్రాన్ ఒక ఖాళీ ఎడారి కాదు. అక్కడ కుటుంబాలు, పిల్లలు, కలలు కనే మనుషులు ఉన్నారు. యుద్ధం కోరుకునే వారు మానసికంగా అనారోగ్యంతో ఉన్నట్టే" అని సఫా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సుమారు కోటి మంది జనాభా ఉన్న టెహ్రాన్‌పై అణుదాడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని, వాషింగ్టన్, బెర్లిన్, లండన్ వంటి నగరాలపై ఇలాంటి దాడి జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నిజాన్ని బయటపెట్టడం కోసమే తన దౌత్యపరమైన కెరీర్‌ను వదులుకున్నానని, ముప్పు ఏర్పడకముందే దీన్ని ఆపాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు.
మహమద్ సఫా 2016 నుంచి 'పేట్రియాటిక్ విజన్' (పీవీఏ) అనే అంతర్జాతీయ సంస్థకు ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థకు ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలిలో ప్రత్యేక సలహా హోదా ఉంది. 2013 నుంచి ఆయన పీవీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
గత మూడేళ్లుగా తాను ఎంతో ఓపిక పట్టానని, 2023లోనే రాజీనామా చేయాలని భావించినట్లు సఫా చెప్పారు. 2023 అక్టోబర్‌లో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత తన అభిప్రాయాల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ను విమర్శించడానికి ఐక్యరాజ్యసమితిలోని కొందరు సీనియర్ అధికారులు ఇష్టపడటం లేదని ఆయన ఆరోపించారు. ఒక 'శక్తివంతమైన లాబీ' కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించిందని, దానికి కొందరు ఐక్యరాజ్యసమితి అధికారులు 'సేవ' చేస్తున్నారని విమర్శించారు.
ఈ పరిణామాల తర్వాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మరణ బెదిరింపులు వచ్చాయని సఫా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో నేరుగా కాకపోయినా, సదరు లాబీకి 'సేవ' చేస్తున్న అధికారుల ద్వారా సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొన్నట్లు ఆయన ఆరోపించారు. సఫా చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి ఇంకా స్పందించలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.