రేషన్ 'సన్నబియ్యం'తో సీఎం రేవంత్ రెడ్డి లంచ్... పక్కనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ఏడాది క్రితం ప్రారంభమైన సన్నబియ్యం పథకం
- సెంట్రల్ హాలులో లంచ్ ఏర్పాటు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పక్కపక్కనే కూర్చుని లంచ్ చేసిన రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ హాలులో ఈ లంచ్ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని భోజనం చేశారు. ముఖ్యమంత్రి, కోమటిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ లంచ్‌లో పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆలోచన తనది అయినప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.