Sridhar Babu: న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకువస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో న్యాయవాదులు వామనరావు దంపతులు హత్యకు గురైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
పట్టపగలు నడిరోడ్డుపై వారు హత్యకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారిని హత్య చేశారని ఆరోపించారు. అప్పట్లో వామనరావు కుటుంబసభ్యులకు న్యాయం జరగలేదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ బిల్లు తీసుకువస్తున్నట్లు చెప్పారు.