Donald Trump: ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని చమురు నిల్వలను, ఆ దేశ వాణిజ్యానికి గుండెకాయలాంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో వెనిజువెలాలో నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత అక్కడి చమురు పరిశ్రమను నియంత్రించినట్లే, ఇరాన్‌లోనూ చమురును తీసుకోవడానికే తాను మొగ్గుచూపుతానని స్పష్టం చేశారు.
"నిజం చెప్పాలంటే ఇరాన్ చమురును తీసుకోవడమే నాకు ఇష్టమైన పని. కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉంది" అని ట్రంప్ పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. దీనిని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకురావచ్చని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ చర్యతో అమెరికా దళాలకు ముప్పు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇరాన్‌తో భూతల పోరు కోసం సుమారు 10,000 మంది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్‌లోని 13,000 లక్ష్యాలపై బాంబు దాడులు చేశామని, మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీలోపు తమ షరతులకు అంగీకరించకపోతే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని గడువు విధించారు.
మరోవైపు, పాకిస్థాన్ రాయబారుల ద్వారా ఇరాన్‌తో పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయని, అవి సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. "ఆయన బహుశా మరణించి ఉండొచ్చు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉండొచ్చు. ఆయన కనిపించకుండా పోయారు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ నాయకత్వం సురక్షితంగా ఉందని స్పష్టం చేస్తోంది.