Chండepalli స్వామి: విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!

పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడటం, ఈ దారుణాన్ని మరో ఉపాధ్యాయుడు రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు యత్నించడం నారాయణపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ భర్తతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం మద్దూరు మండలం మోమినాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండేపల్లి స్వామి, అదే పాఠశాలలోని పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వామితో వ్యక్తిగత విభేదాలున్న మరో ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డి, వీరిద్దరూ కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను రహస్య కెమెరాతో చిత్రీకరించాడు.

అనంతరం గురునాథ్ రెడ్డి ఈ వీడియోను స్థానిక సర్పంచ్ భర్త గూళ్ల రవికి పంపాడు. దీంతో రవి తన అనుచరులైన ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవిలతో కలిసి ఉపాధ్యాయుడు స్వామి, గురునాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులను డబ్బు కోసం బెదిరించాడు. వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మార్చి 26న ఈ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ జరిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాలికపై స్వామి అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. నేరంలో భాగమైన స్వామి, గురునాథ్ రెడ్డి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్ చెన్నకేశవులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన సర్పంచ్ భర్త గూళ్ల రవితో పాటు అతని ముగ్గురు అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, వారి నుంచి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Chండepalli స్వామి
Narayana পেট district
teacher arrest
student assault
sexual assault
blackmail case
Pocso act
crime news
telangana news
school scandal

More Telugu News