Virat Kohli: ఆర్సీబీ ఘన విజయం.. అనుష్కకు కోహ్లీ ఫ్లయింగ్ కిస్!

Virat Kohli Flying Kiss to Anushka After RCB Victory
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం తన భార్య, నటి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.

బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. సుమారు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), రజత్ పటీదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌లు తోడవడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం అందుకుంది.

విజయం ఖాయమయ్యాక, స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ వైపు చూస్తూ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆమెతో పాటు ఆర్సీబీ మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కూడా ఉండటం విశేషం. ఈ దృశ్యానికి స్టేడియంలోని ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80), చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) రాణించడంతో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, రొమారియో షెపర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Go Back to Shorts
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
Anushka Sharma
IPL 2026
SRH
Sunrisers Hyderabad
Cricket
Smriti Mandhana

More Telugu News