Sundar C: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త

Sundar C to Contest in Tamil Nadu Assembly Elections
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మధురై సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పుతియ నీతి కట్చి (పీఎన్‌కే) పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది అన్నాడీఎంకే కూటమిలోని పార్టీ. ఈ నియోజకవర్గం బరిలో అధికార డీఎంకే పార్టీ నుంచి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది.

పీఎన్‌కే వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం మాట్లాడుతూ, మధురై సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున చిదంబరం పిళ్లై కుమారుడు సుందర్ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. సుందర్ అన్నాడీఎంకే పార్టీ గుర్తు మీదే పోటీ చేయనున్నట్లు షణ్ముగం వెల్లడించారు. సుందర్... ప్రముఖ నటి, బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ భర్త అని తెలిసిందే. ఆమె 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

తన భర్త పోటీ చేయడంపై ఖుష్బూ స్పందిస్తూ, ఆయన సినిమా కెరీర్‌లో మూడు దశాబ్దాలకు పైగా ప్రజలు మద్దతుగా నిలిచారని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పోటీ చేస్తున్నారని, ఆయన నిర్ణయానికి సుందర్ భార్యగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Sundar C
Tamil Nadu Assembly Elections
Khushbu
Madurai Central
Puthiya Needhi Katchi
PNK Party

More Telugu News