Narendra Modi: ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ

పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రతి దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. అక్కడ గత నెల రోజులుగా భీకర పోరు కొనసాగుతోందని అన్నారు. ఈ యుద్ధం కారణంగా ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో దేశాల్లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిందని అన్నారు.

ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మన దేశాన్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతులు, ప్రజలపై ఈ యుద్ధం భారం పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంతటి సంక్షోభ సమయంలో మన దేశంలో అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని, ప్రశాంతతను పాటించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు దేశం, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని అన్నారు.

నోయిడాలోని జేవార్ ప్రాంతంలో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రూ.11,200 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఆధునాతన నావిగేషన్ సిస్టమ్స్ సహాయంతో 3,900 మీటర్ల పొడవైన ఈ విమానాశ్రయం రన్‌వేపై అతిపెద్ద విమానాలు కూడా రాకపోకలు సాగించే వీలుంది. సరకు రవాణా కోసం కార్గో లాజిస్టిక్ జోన్లను అనుసంధానం చేస్తూ మల్టీమోడల్ కార్గో హబ్‌నూ నిర్మించారు.
Narendra Modi
Global crisis
West Asia tensions
India economy
Food supply
Energy crisis
Jewar airport

More Telugu News