ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అణు కేంద్రానికి జరిగే నష్టం, దీర్ఘకాలంలో రేడియోలాజికల్ ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించింది.
ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌లో రేడియేషన్ లీకేజీ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. ఆ ప్లాంట్‌లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసి పేర్కొన్నారు.
ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్న ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు ప్రమాదం జరిగితే, రేడియేషన్ లీకేజీ వల్ల ఇరాన్‌తో పాటు ఆ దేశం వెలుపల భారీస్థాయిలో ప్రమాదం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా హెచ్చరించారు.
ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ నిల్వలు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈదాడుల్లో బుషెహర్ ప్రావిన్సులోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ దాడులు బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలోనే జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనితో రేడియేషన్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.