బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.  బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం తాగి వస్తారంటూ సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన నిరాధార ఆరోపణలను అభిమానులు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక వ్యక్తిని దూషించడం మాత్రమే కాదని, పవిత్రమైన శాసనసభను అగౌరవపరచడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీ ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ విజయకృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడు సొహైల్ అహ్మద్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అతని ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. వీరి వెంట హనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్ సహా పలువురు అభిమానులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.



More Telugu News