తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా రామ్ చరణ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణను, తెలుగు జాతి సత్తాను రామ్ చరణ్ ప్రపంచానికి చాటిచెబుతున్న తీరు పట్ల గర్విస్తున్నాం అంటూ ప్రశంసించారు.
ఈ మేరకు లోకేశ్ తన సందేశంలో, "ప్రియమైన రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, క్రమశిక్షణ, అలాగే తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్న తీరు మా అందరికీ గర్వకారణం" అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదలైన గ్లింప్స్ వీడియో వైరల్ అవుతోంది.