YS Jagan: అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్
శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన సందేశం ఇచ్చారు.
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు అని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.