మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్!
ఐపీఎల్ సందడి మొదలైన వేళ, కర్ణాటకలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వీఐపీ కోటాలో తమకు ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా డిమాండ్ చేశారు. తాము ప్రజాప్రతినిధులమని, సామాన్యుల్లా క్యూలో నిలబడి టికెట్లు కొనలేమని వారు స్పష్టం చేశారు. మార్చి 28న బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశపనవర్ సభలో బలంగా ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని ఆరోపించారు. "మేము వీఐపీలం. క్యూలో నిలబడడం మావల్ల కాదు" అని తేల్చిచెప్పారు. ప్రతి ఎమ్మెల్యేకు కనీసం ఐదు టికెట్లు ఇవ్వాలని, ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌కు విపక్ష బీజేపీ నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు భూమి పొందిన కేఎస్‌సీఏ, టికెట్లను వేలకు అమ్ముతూ కోట్లు సంపాదిస్తోందని విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఈ వివాదంపై స్పీకర్ యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం కేఎస్‌సీఏతో చర్చలు జరపాలని సూచించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని సభకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల డిమాండ్ సహజమేనని, వారికి ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.