Chandrababu: ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు

Dhulipalla Narendra Kumar Daughters Wedding Attended by CM Chandrababu
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకావడం విశేషం. ఇదే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలిసి సందడి చేశారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. ఈ పెళ్లి వేడుక పలువురు రాజకీయ ప్రముఖుల కలయికకు వేదికగా నిలిచింది.

Go Back to Shorts
Chandrababu
Dhulipalla Narendra Kumar
Revanth Reddy
Nara Lokesh
Andhra Pradesh Politics
Telugu Desam Party
Guntur
Marriage Ceremony
Political Gathering

More Telugu News