హర్మూజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్ అంశాలపై 40 ఏళ్ల క్రితమే ట్రంప్ పత్రికా ప్రకటన

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో తమకు అవసరంలేని చమురు రవాణాకు రక్షణ కల్పిస్తున్నామని, ఇలాంటి జలసంధిని కాపాడుకోవడానికి అందరూ రావాలని యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇలాంటి మాటలనే దాదాపు 40 ఏళ్ల క్రితం కూడా చెప్పారు.

ఇరాన్‌తో యుద్ధం వేళ, నాలుగు శతాబ్ధాల క్రితం ట్రంప్ ఇచ్చిన వాణిజ్య ప్రకటన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

"తనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని నౌకలకు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిలిటరీ రక్షణగా ఉంటోంది. తమకు అవసరంలేని చమురు రవాణాకు సహకారం అందిస్తోంది. ఈ ప్రక్రియ నుంచి లబ్ధి పొందుతున్న దేశాలు మాత్రం ఒక్క డాలర్ కూడా ఇవ్వడంలేదు. కనీసం ఒక్క సైనికుడిని కూడా పంపించలేదు" అంటూ ట్రంప్ 1987లో మూడు పత్రికల్లో 94,801 డాలర్లు చెల్లించి యాడ్ ఇచ్చారు. అమెరికా డబ్బుతో జపాన్ ఇతర దేశాల ప్రయోజనాలు కాపాడుతున్నారని నాటి అమెరికా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆ తర్వాత ఏడాది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ ఖర్గ్ ఐలాండ్ గురించి మాట్లాడారు. ఇరాన్‌లోని అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్ ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలోనూ ఆయన హర్మూజ్ జలసంధిపై వివిధ దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఖర్గ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉందని వార్తలు వచ్చాయి.


More Telugu News