బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
- హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు
- బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు
- ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్
- ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం
- రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆయనపై పోక్సో కేసు నమోదు కాగా, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు యువతి కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ పరస్పర ఫిర్యాదులతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో బండి భగీరథ్ (24), తన కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి బాలిక డిప్రెషన్‌లో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైందని ఆమె తల్లి పోలీసులకు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్ వర్ధన్ తెలిపారు.
మరోవైపు సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఆమెతో స్నేహపూర్వక సంబంధం ఉందని, ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇప్పటికే ఆమె తండ్రికి రూ.50 వేలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో మరికొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సదరు బాలికతో తన స్నేహితులు కూడా వేధింపులు ఎదుర్కొన్నారని, వారి ఫిర్యాదుతో ఏప్రిల్ 21న నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైందని భగీరథ్ తెలిపారు. మరోవైపు, 2022లో సదరు బాలిక తండ్రిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుమారుడిని వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తాను కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని శక్తులు పన్నిన కుట్ర ఇదని, న్యాయవ్యవస్థే నిజానిజాలు తేలుస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ ‘బేటీ బచావో’ నినాదం ఏమైందని, కేంద్రమంత్రి కుమారుడిపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.