ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో ఐదు రోజుల కాల్పుల విరమణ పాటించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తక్షణమే దాడులు చేయాలని ఆయన ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ తన అణు క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తోందని, ఆ దేశ రాజకీయ, సైనిక నాయకులు రహస్య బంకర్లలో సమావేశమవుతున్నారని తమ వద్ద పక్కా నిఘా సమాచారం ఉందని నెతన్యాహు అమెరికాకు వివరించారు. వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తేనే ప్రస్తుత యుద్ధానికి ముగింపు పలకవచ్చని ఆయన బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఐదు రోజుల గడువును ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకుంటుందని, ఇది మిత్రదేశాల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నెతన్యాహు తాజా ఒత్తిడితో అంతర్జాతీయంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని, ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నెతన్యాహు విజ్ఞప్తిని వైట్ హౌస్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అధ్యక్షుడు ట్రంప్ తన రక్షణ మంత్రి, నిఘా వర్గాల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ కూడా అప్రమత్తమై తన గగనతల రక్షణ వ్యవస్థలను హై అలర్ట్‌లో ఉంచింది.