Chandrababu Naidu: జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Responds to AP Job Calendar Release
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది వేళ తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను" అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

Go Back to Shorts
Chandrababu Naidu
AP Jobs
Andhra Pradesh Jobs
Job Calendar 2024
AP Government Jobs
Private Sector Jobs
AP Employment
Ugadi
AP New Jobs

More Telugu News