సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి

Telangana
Advertisement
  • సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న జీవన్ రెడ్డి
  • అలాంటి వ్యక్తి కలిసి పనిచేస్తామని చెప్పడమేమిటని నిలదీత
  • బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీత
  • కాంగ్రెస్ పార్టీని వీడితే అందుకు సంజయ్ కుమార్ బాధ్యుడన్న జీవన్ రెడ్డి
  • నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య
  • కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకుంటున్నానని జీవన్ రెడ్డి వ్యాఖ్య
  • కానీ ఎక్కడ ఉన్నా చిత్తశుద్ధితో పనిచేస్తానన్న జీవన్ రెడ్డి
Advertisement
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అంటున్నారని, ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నారని, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలా అంటారని నిలదీశారు. సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పీకర్ చెప్పారని, కాంగ్రెస్‌లో పనిచేసేందుకు తనతో కలిసి వస్తానని సంజయ్ చెబుతున్నారని, నాకు ఆఫర్ ఇచ్చేందుకు ఆయన ఎవరని ప్రశ్నించారు.

నేను పార్టీ మారుతానని సంజయ్‌కి ఏమైనా చెప్పానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీలో ఉన్నానో సంజయ్ కుమార్‌కు తెలియడం లేదా అని ఎద్దేవా చేశారు. అసలు తనకు పార్టీ వీడాలనే ఆలోచన కల్పించింది సంజయ్ కుమార్ కాదా అని అన్నారు. గతంలో కేసీఆర్‌తోనూ తాను కలిసి పనిచేశానని, కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేమిటని ప్రశ్నించారు. అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ ఆయనతో కలిసి ఎలా పనిచేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం మామూలు విషయం కాదని అన్నారు. సంజయ్ చేసేదంత చేస్తూ శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని సంజయ్ కుమార్ చెబుతున్నారని, అందులో తప్పులేదని, కానీ కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.

20 నెలలుగా సంజయ్ కుమార్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. పార్టీ మార్పు అంశం గురించి మాట్లాడుతూ, తాను ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబద్ధంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అలాగే కొనసాగాలని భావిస్తున్నానని తెలిపారు. కానీ ఈ బంధం తెగిపోతే ఎవరేం చేయగలరని అన్నారు. కానీ ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Jeevan ReddySanjay KumarTelangana CongressBRS partyJagityal MLATelangana PoliticsCongress Party

More Telugu News

విమానం బాత్రూంలో ఇమడలేకపోయిన పొడగరి.. కానీ నెటిజన్లు ఫోకస్ వేరే!

05 Nov, 11:50

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42

అంతర్జాతీయ పరిణామాలతో దూసుకెళ్లిన పసిడి.. ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం

05 Nov, 11:41

ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం.. డోర్లు మూస్తేనే బస్సు ముందుకు!

05 Nov, 11:24

రామాయణం చివర్లో సన్నీ డియోల్ ఎంట్రీ... హనుమంతుడిగా అదుర్స్

05 Nov, 11:23

కూటమి బలాన్ని తట్టుకుని పోరాడాం: జీవీఎంసీ ఓటమిపై వరుదు కల్యాణి

05 Nov, 11:21

ఖాళీ గదిలో మాట్లాడితే శబ్దం ఎందుకు ఎక్కువగా వస్తుంది?.. సైన్స్ ఏం చెబుతోంది?

05 Nov, 11:20

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. సచిన్‌ ఏమన్నారంటే..!

05 Nov, 11:18

దలాల్ స్ట్రీట్‌కు దీపావళి కానుక.. అమెరికా ఫలితాలతో రూ. 7 లక్షల కోట్ల సంపద!

05 Nov, 11:16

94 శాతం స్ట్రైక్‌రేట్‌ను దాటాలి.. పరిషత్ ఎన్నికలకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్

05 Nov, 11:15

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

05 Nov, 11:14

అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు.. కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు!

05 Nov, 11:09

ఉద్రిక్తతల మధ్య భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

05 Nov, 11:07

ఇరాన్‌తో యుద్ధం చేద్దామా? వద్దా?.. డైలమాలో ట్రంప్

05 Nov, 11:06
..More Telugu News