ప్లంబర్ సంపాదన ఏడాదికి రూ.18 లక్షలా.. !

Offbeat
Advertisement
  • నెట్టింట వైరల్ గా మారిన ముంబై టెకీ పోస్టు
  • తమ హౌసింగ్ సొసైటీ ప్లంబర్ హ్యుండాయ్ లేటెస్ట్ కారు మెయింటెన్ చేస్తున్నాడని వెల్లడి
  • సొంతూర్లో ఇల్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడని వివరణ
Advertisement
ముంబైకి చెందిన ఒక ప్లంబర్ ఏడాదికి దాదాపు ‘‘రూ.18 లక్షలు’’ గడిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. సాధారణంగా వైట్ కాలర్ ఉద్యోగుల స్థాయి ఆదాయాన్ని ఒక ప్లంబర్ సంపాదిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సదరు ప్లంబర్ ‘‘హుందాయ్ క్రెటా’’ వంటి లగ్జరీ కారును కలిగి ఉండటం విశేషం. ముంబై లాంటి ఖరీదైన నగరంలో ఒక ప్లంబర్ ఇంతటి ఆర్థిక స్థాయిని కలిగి ఉండటం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఈమేరకు ఓ టెక్కీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టు పెట్టారు.

అందులో వెల్లడించిన వివరాలు.. ఇటీవల తన ఇంట్లో ఓ పైపు మరమ్మతు కోసం హౌసింగ్ సొసైటీ ప్లంబర్ ను పిలిచానని టెక్కీ చెప్పారు. పైపు మరమ్మతు చేస్తూ ఆ ప్లంబర్ తన జీవితం, సంపాదన, తాను కూడబెట్టిన ఆస్తుల గురించి చెప్పుకొచ్చాడని వివరించారు. తమ హౌసింగ్ సొసైటీతో పాటు బోరివలీ, కాండీవలీలోని మొత్తం మూడు సొసైటీలలో పనిచేస్తూ ఏటా 18 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. తొలుత ఆయన జోక్ చేస్తున్నాడని భావించినా.. సొంతూళ్లో ఇల్లు కట్టుకున్నానని, కొంత వ్యవసాయ భూమి కూడా కొనుగోలు చేశానని చెప్పడంతో నమ్మానని వివరించారు.

నెటిజన్ల ప్రతిస్పందన
ఈ పోస్టు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మేము తప్పుడు కెరీర్ ఎంచుకున్నామా?" అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ‘‘నైపుణ్యం ఉన్న పనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని’’ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ముంబై లాంటి నగరాల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులకు ఉండే విపరీతమైన డిమాండ్ కారణంగా ఇది సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ పనైనా అంకితభావంతో మరియు నైపుణ్యంతో చేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చదువుతో పాటు 'వృత్తి నైపుణ్యం' కూడా అంతే ముఖ్యమని ఈ కథనం నిరూపిస్తోంది. చాలా మంది ఐటీ ఉద్యోగుల కంటే ఈ ప్లంబర్ మెరుగ్గా సంపాదిస్తున్నాడని నెటిజన్లు తమ 'లైఫ్ ఛాయిస్' గురించి పునరాలోచనలో పడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

Mumbai PlumberPlumber income18 Lakh incomeHyundai CretaBorivaliKandivaliPlumbing demandSkilled workWhite collar jobsCareer choices

More Telugu News

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42

అంతర్జాతీయ పరిణామాలతో దూసుకెళ్లిన పసిడి.. ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం

05 Nov, 11:41

ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం.. డోర్లు మూస్తేనే బస్సు ముందుకు!

05 Nov, 11:24

రామాయణం చివర్లో సన్నీ డియోల్ ఎంట్రీ... హనుమంతుడిగా అదుర్స్

05 Nov, 11:23

కూటమి బలాన్ని తట్టుకుని పోరాడాం: జీవీఎంసీ ఓటమిపై వరుదు కల్యాణి

05 Nov, 11:21

ఖాళీ గదిలో మాట్లాడితే శబ్దం ఎందుకు ఎక్కువగా వస్తుంది?.. సైన్స్ ఏం చెబుతోంది?

05 Nov, 11:20

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. సచిన్‌ ఏమన్నారంటే..!

05 Nov, 11:18

దలాల్ స్ట్రీట్‌కు దీపావళి కానుక.. అమెరికా ఫలితాలతో రూ. 7 లక్షల కోట్ల సంపద!

05 Nov, 11:16

94 శాతం స్ట్రైక్‌రేట్‌ను దాటాలి.. పరిషత్ ఎన్నికలకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్

05 Nov, 11:15

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

05 Nov, 11:14

అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు.. కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు!

05 Nov, 11:09

ఉద్రిక్తతల మధ్య భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

05 Nov, 11:07

ఇరాన్‌తో యుద్ధం చేద్దామా? వద్దా?.. డైలమాలో ట్రంప్

05 Nov, 11:06

రూపాయికి రెక్కలు, చమురుకు బ్రేకులు.. అమెరికా ఎన్నికల ఫలితాలతో భారత్‌కు ఊరట!

05 Nov, 11:01
..More Telugu News