ఇరాన్ యురేనియంపై పుతిన్ ప్రతిపాదనకు నో చెప్పిన ట్రంప్!
- ఫోన్‌లో మాట్లాడుకున్న పుతిన్, ట్రంప్
- ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు తరలిస్తామన్న పుతిన్
- రష్యా అధ్యక్షుడి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధినేత
రష్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన ఇదే మొదటిసారి కాదని అమెరికా చెబుతోంది. ఇంతకుముందు కూడా పుతిన్ ఇలాంటి ప్రతిపాదనలు చేశారని అమెరికా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. యురేనియం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనేది అమెరికా వైఖరి అని తెలిపారు. మరోవైపు, పుతిన్ చేసిన ప్రతిపాదనకు ఇరాన్ కూడా అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. యుద్ధానికి ముందు అమెరికాతో జరిగిన చర్చల సమయంలో కూడా ఇరాన్ ఇటువంటి అంశాలను అంగీకరించలేదని తెలుస్తోంది.