Harish Rao: పార్టీ ఫిరాయింపులు... రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Harish Rao Letter to Rahul Gandhi on Party Defections
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం
  • ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో పెట్టారన్న హరీశ్ రావు
  • రాజ్యాంగ రక్షణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమా అని ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబట్టి దేశమంతా నీతిసూత్రాలు చెబుతున్నారని, కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అలాగే రాహుల్ గాంధీ కూడా దేశమంతా నీతిసూత్రాలు చెబుతున్నారని అన్నారు. కానీ తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడమే రాజ్యాంగాన్ని రక్షించడమా అని ఎద్దేవా చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
Harish Rao
Rahul Gandhi
Telangana
Congress Party
Party defections
BRS
Indian Constitution

More Telugu News