Mojtaba Khamenei: 17 ఏళ్లకే వ్యూహం.. యుద్ధ క్షేత్రంలో నాడు పడిన పునాదే నేడు ‘సుప్రీం’ పీఠానికి చేర్చింది!
- ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ నియామకం
- ఎలాంటి అధికారిక పదవి లేకుండానే అత్యున్నత పీఠం అధిరోహణ
- యుద్ధ క్షేత్రంలో ఏర్పరచుకున్న సైనిక నెట్‌వర్క్‌తోనే ఎదుగుదల
- ఇరాన్ విప్లవ సిద్ధాంతాలకు విరుద్ధంగా వారసత్వ నియామకంపై చర్చ
ఇరాన్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ అత్యున్నత నాయకుడిగా (సుప్రీం లీడర్) మోజ్తబా ఖమేనీ (56) బాధ్యతలు చేపట్టారు. ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయని, బహిరంగంగా పెద్దగా కనిపించని ఆయన.. ఏకంగా దేశ సర్వాధికారిగా మారడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని వెనుక నాలుగు దశాబ్దాల పక్కా వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మోజ్తబా ఎదుగుదలకు బీజం 1986లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో పడింది. అప్పుడు 17 ఏళ్ల వయసులో ఆయన 'హబీబ్ బెటాలియన్'లో ఒక సాధారణ వాలంటీర్‌గా చేరారు. ఇరాన్ సైన్యం (IRGC)లో అత్యంత శక్తిమంతంగా ఎదిగిన హొస్సేన్ తాయెబ్, హొస్సేన్ నెజాత్ వంటి కమాండర్లతో అక్కడే బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ సైనిక నెట్‌వర్కే ఆయనను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది.
గత కొన్నేళ్లుగా మోజ్తబా తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి, బయటి ప్రపంచానికి మధ్య ఒక 'గేట్ కీపర్'గా వ్యవహరించారు. కీలక నియామకాలు, విదేశాంగ విధానాలు, నిఘా సంస్థల కార్యకలాపాల్లో తెర వెనుక నుంచి చక్రం తిప్పారు. ఈ కారణంగానే అమెరికా దౌత్యవేత్తలు ఆయన్ను 'తెర వెనుక పాలకుడు' అని అభివర్ణించారు.
1979 ఇరాన్ విప్లవం వారసత్వ, రాజరిక పాలనను అంతం చేసింది. అయితే, ఇప్పుడు మోజ్తబా నియామకం రక్త సంబంధానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇది విప్లవ సిద్ధాంతాలకు విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైన్యం (IRGC) ఒత్తిడితోనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ నిఘా వర్గాలు, పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంతర్గత నిరసనలు, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఇరాన్‌ను తన సైనిక నేపథ్యంతో మోజ్తబా ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.