Nizamabad bus accident: నిజామాబాద్ జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
- ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి
- పలువురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.