Kavya Maran: ది హండ్రెడ్ కోసం... పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
- ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ది హండ్రెడ్ టోర్నీ
- సన్‌రైజర్స్ లీడ్స్ పేరుతో జట్టును కలిగి ఉన్న సన్ గ్రూప్
- సన్‌రైజర్స్ లీడ్స్‌లోకి అబ్రార్ అహ్మద్‌ను తీసుకున్న కావ్యా మారన్
ది హండ్రెజ్ టోర్నీలో భాగంగా 'సన్‌రైజర్స్' పాకిస్థాన్ స్టార్ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న 'ది హండ్రెడ్' టోర్నీకి ''సన్‌రైజర్స్ లీడ్స్' జట్టు అతడిని తీసుకుంది. ది హండ్రెడ్ కోసం వేలం నిర్వహిస్తున్నారు. మన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అక్కడ కూడా జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాక్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌తో రూ.2.34 కోట్లకు కాంట్రాక్టును కుదుర్చుకుంది.
మన వద్ద ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సన్‌గ్రూప్‌కు చెందినది. ఇదే గ్రూప్‌నకు అక్కడ సన్‌రైజర్స్ లీడ్స్ పేరుతో ఒక టీమ్ ఉంది. ఈ జట్టులోకి పాకిస్థాన్ ఆటగాడిని తీసుకుంది. అబ్రార్ అహ్మద్‌ను 190,000 పౌండ్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేయగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2.34 కోట్లుగా ఉంటుంది. సన్‌రైజర్స్ గ్రూప్ యజమాని కళానిధి మారన్. కావ్యా మారన్ సన్‌రైజర్స్ జట్టుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు.
ది హండ్రెడ్ కోసం కొనసాగుతున్న వేలంలో కావ్యా మారన్ స్వయంగా పాల్గొన్నారు. సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. ఐపీఎల్ టోర్నీకి పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోకూడదు. కానీ ఈ నిబంధన ది హండ్రెడ్ లీగ్‌కు వర్తించదు. అందుకే కావ్యామారన్ అబ్రార్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ది హండ్రెడ్ సరికొత్త, వేగవంతమైన 100 బంతుల క్రికెట్ టోర్నమెంట్. ప్రతి ఇన్నింగ్స్‌కు 100 బంతులు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు సుమారు రెండున్నర గంటల్లో ముగుస్తాయి. ది హండ్రెడ్‌లో ప్రతి బౌలర్ గరిష్ఠంగా 20 బంతులు వేయవచ్చు.