యుద్ధం వల్ల అమెరికాకు భారీగా ఖర్చు.. తొలి 6 రోజుల్లోనే లక్ష కోట్లు

Donald Trump US Spent Lakh Crores in First 6 Days of War
  • ఇరాన్ పై దాడులకు అత్యాధునిక మిసైళ్లు ప్రయోగిస్తున్న అగ్రరాజ్యం
  • యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలతో అదనపు నిధుల కోసం ట్రంప్ సర్కార్ వేట
  • మరో 50 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాలని కాంగ్రెస్ కు ప్రతిపాదనలు
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అగ్రరాజ్యం అమెరికాకు చమటలు పట్టిస్తున్నాయి. గత 12 రోజులుగా ఇరాన్‌పై చేస్తున్న దాడులకు అమెరికా మంచినీళ్లలా డబ్బు ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఏకంగా 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. సెనేటర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో రక్షణ శాఖ అధికారులు ఈ గణాంకాలను బయటపెట్టారు. గత నెల 28న యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధ సామగ్రిని అమెరికా ప్రయోగించింది. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవ ఖర్చు ఈ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని సెనేటర్ క్రిస్ కూన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో అదనపు నిధుల కోసం ట్రంప్ సర్కార్ వేట మొదలుపెట్టింది. త్వరలోనే మరో 50 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాలని కోరుతూ వైట్‌హౌస్ కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపనుంది. ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ నిల్వలు నిండుకుంటున్నాయని, ప్రస్తుత యుద్ధం సైనిక శక్తిని మరింత కుంగదీస్తుందని కాంగ్రెస్ సభ్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తకుండా చమురు నిల్వలను విడుదల చేసేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది.
Go Back to Shorts
War Expenses
Donald Trump
United States
Iran
West Asia Conflict
US Military Spending
Middle East Crisis
Defense Budget
Oil Reserves
Senator Chris Coons

More Telugu News