Iran: గల్ఫ్‌లో ఇరాన్ పంజా: అమెరికా నౌకపై క్షిపణి దాడి.. ఒకరి మృతి!
- అమెరికా నౌక సహా రెండు నౌకలపై ఇరాన్ దాడి
- క్షిపణి దాడిలో ఒక నావికుడి మృతి.. పలువురికి గాయాలు
- గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్.. అప్రమత్తమైన అగ్రరాజ్యం
- కీలకమైన సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం
- డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్ దళాలు
గల్ఫ్ జలాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ దళాలు జరిపిన భీకర దాడుల్లో అమెరికా యాజమాన్యంలోని ఒక వాణిజ్య నౌకతో పాటు మరో నౌక కూడా తీవ్రంగా దెబ్బతింది. క్షిపణులు నేరుగా నౌకను తాకడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గల్ఫ్ రీజియన్‌లో యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ తన అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులను ఈ దాడుల్లో ప్రయోగించినట్లు తెలుస్తోంది. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా నౌకపై దాడి జరగడం అగ్రరాజ్యానికి నేరుగా సవాల్ విసిరినట్లయింది.
ఈ దాడుల నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా పలు నౌకలు తమ మార్గాలను మార్చుకుంటున్నాయి. అమెరికా తన నౌకాదళాన్ని మరింత అప్రమత్తం చేయడంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది.