హైదరాబాద్ టు థాయ్‌లాండ్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ టు థాయ్‌లాండ్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Air India Express Flight Hard Landing at Phuket Airport
  • పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం
  • రన్‌వేను బలంగా ఢీకొట్టిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
  • 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పుకెట్ వెళ్లిన విమానం
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను బలంగా ఢీకొట్టింది. దీనితో విమానం ముందుభాగం చక్రం దెబ్బతిన్నది. దీంతో రన్‌వేను మూసివేస్తూ విమానాశ్రయం అధికారులు నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్) జారీ చేశారు.

బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం ఉదయం 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.40 గంటలకు థాయ్‌లాండ్‌లో హార్డ్ ల్యాండ్ అయింది. అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. హార్డ్ ల్యాండింగ్ కారణంగా నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం రన్‌వేపై కొద్దిదూరం జారిపోయింది.
Advertisement
Air India Express
Air India Express flight
Phuket International Airport
Thailand
Hyderabad to Thailand flight

More Telugu News