Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ట్రంప్ వార్నింగ్
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ నియామకం
- ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- "అతను ప్రశాంతంగా జీవించలేడు" అంటూ ఘాటు హెచ్చరిక
- నియామకంలో తన ప్రమేయం ఉండాల్సిందని వ్యాఖ్య
- పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. "అతను ప్రశాంతంగా జీవించగలడని నేను అనుకోవడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయన కుమారుడైన 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీని కొత్త అధినేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇరాన్ ఈ నాయకుడిని ఎన్నుకోవడంపై నేను సంతోషంగా లేను. అతను ప్రశాంతంగా బతకలేడు" అని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో వెనెజువెలా తరహాలోనే తన ప్రమేయం కలిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, ఖమేనీ విధానాలు గత పాలకుల మాదిరే కొనసాగితే ఐదేళ్లలో మరో యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. "ఆ పదవిలో కొనసాగాలంటే అతను మా అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఎక్కువ కాలం ఉండలేడు" అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.