Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రికకు.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

Bollineni Chandrika Receives Financial Aid From SAP Chairman
  • పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ చంద్రికకు అనారోగ్యం
  • ఆసుపత్రిలో పరామర్శించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
  • తక్షణ సాయంగా రూ. 1 లక్ష అందజేత

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ బొల్లినేని చంద్రిక అనారోగ్యానికి గురవ్వడం క్రీడా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. 'స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'గా గుర్తింపు పొందిన ఆమెను శాప్ (SAP) చైర్మన్ రవి నాయుడు ఆసుపత్రిలో పరామర్శించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రికకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ. 1 లక్ష నగదును రవి నాయుడు అందజేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన క్రీడాకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. చంద్రిక కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదని, ఆమె పోరాట స్ఫూర్తి ఎంతో మంది యువ అథ్లెట్లకు ఆదర్శమని కొనియాడారు. 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ మరియు 2019 ఆసియా పసిఫిక్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు సాధించిన చంద్రిక, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Bollineni Chandrika
SAP Chairman
Ravi Naidu
Powerlifting Champion
Andhra Pradesh
Financial Assistance
Sports News
Commonwealth Championship
Asia Pacific Championship
International Athlete

More Telugu News