Ricky Martin: టీ20 ఫైనల్ ముందు తారల సందడి.. రికీ మార్టిన్, ఫల్గుణి పాఠక్, సుఖ్ బీర్ ప్రదర్శనలతో హోరెత్తిన స్టేడియం
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ముందు ఘనంగా ముగింపు వేడుకలు
- ఆట ముందు పాటల హోరు.. టీ20 ఫైనల్ వేడుకల్లో స్టార్ సింగర్ల హంగామా
- ఫల్గుణి పాఠక్, సుఖ్ బీర్, రికీ మార్టిన్ ప్రదర్శనలతో హోరెత్తిన స్టేడియం
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో వెలిగిపోయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ముగింపు వేడుకలు అభిమానులను ఉర్రూతలూగించాయి. అంతర్జాతీయ పాప్ సంచలనం రికీ మార్టిన్, ప్రముఖ గాయకులు ఫల్గుణి పాఠక్, సుఖ్బీర్ సింగ్ తమ ప్రదర్శనలతో స్టేడియాన్ని హోరెత్తించారు.
ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ గుజరాతీ గాయని ఫల్గుణి పాఠక్ తన సూపర్ హిట్ గీతం ‘మైనే పాయల్ హై ఛంకాయీ’తో స్థానిక ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పంజాబీ, బాలీవుడ్ సింగర్ సుఖ్బీర్ సింగ్ తన పాప్ నంబర్లతో, ముఖ్యంగా ‘ఓ హో హో’ పాటతో స్టేడియంలోని ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఆయన పాటకు ప్రేక్షకులు కూడా గొంతు కలిపి సందడి చేశారు.
అయితే, ఈ ముగింపు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నిలిచారు. రెండుసార్లు గ్రామీ, ఐదుసార్లు లాటిన్ గ్రామీ అవార్డుల విజేత అయిన రికీ మార్టిన్, తనదైన శైలిలో స్టేడియాన్ని ఉర్రూతలూగించారు. ‘లివిన్ లా విడా లోకా’, ‘షీ బ్యాంగ్స్’ వంటి గ్లోబల్ హిట్స్‌తో పాటు, ఐకానిక్ ఫుట్‌బాల్ గీతం ‘ది కప్ ఆఫ్ లైఫ్’ పాడి అభిమానులను అలరించారు. ముఖ్యంగా ‘మరియా’, ‘లా కోపా డె లా విడా’ పాటలతో తన ప్రదర్శనను ముగించి, స్టేడియంలోని వేలాది మంది అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమం అనంతరం జరిగిన టాస్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా, తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. ఈ టోర్నీలో ఛేజింగ్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డుతో కివీస్ బరిలోకి దిగుతోంది. ఈ మెగా ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.