ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ... అమ్మాయిది హైదరాబాదే!

Both States
Advertisement
  • హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో జీవితం పంచుకోనున్న శ్రీనివాస్
  • వేడుకకు హాజరైన బోయపాటి, సంయుక్త మీనన్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
  • న్యాయవాదుల కుటుంబానికి చెందిన వధువు అని ప్రచారం
Advertisement
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో జీవితం పంచుకోనున్నారు.

ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మీనన్ హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. వీరితో పాటు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల వంటి దర్శకులు, నిర్మాతలు కూడా ఈ ప్రైవేట్ వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కాబోయే వధువు కావ్య రెడ్డి వివరాల కోసం నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె సినీ రంగానికి చెందిన వారు కాదు. కావ్య హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాతయ్య జడ్జిగా, తండ్రి న్యాయవాదిగా పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బెల్లంకొండ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'అల్లుడు శీను' చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్, 'రాక్షసుడు' వంటి విజయాలతో గుర్తింపు పొందారు. ఇటీవల 'కిష్కింధపురి' సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'హైందవ', 'టైసన్ నాయుడు' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరి వివాహ తేదీపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bellamkonda SreenivasBellamkonda Sreenivas engagementKavya ReddyTollywood newsTelugu cinemaHyderabadBoyapati SrinuSamyuktha MenonAlludu SeenuRakshasudu

More Telugu News

అర్ణబ్ తుపాను ప్రభావం: పలు కీలక రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

27 Oct, 14:39

డారిల్ మిచెల్ మెరుపులు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

27 Oct, 14:30

15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న నరహంతకుడు.. ఉగాండాలో సీరియల్ కిల్లర్ అరెస్ట్!

27 Oct, 14:21

బడులు పెట్టి చేతులు దులుపుకొంటే సరిపోదు.. రేవంత్‌ సర్కార్‌పై ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు

27 Oct, 14:10

వెంకటేశ్ సినిమాకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

27 Oct, 13:46

ఇక ట్రిపుల్ ఇంజన్ సర్కార్.. స్థానిక ఎన్నికలపై చాలా కసరత్తు చేశాం: సీఎం చంద్రబాబు

27 Oct, 13:43

భారత మిడిలార్డర్‌లో ఆరోగ్యకరమైన పోటీ: నితీశ్‌ రెడ్డి

27 Oct, 13:40

'రోబోను పెట్టుకో, మనిషిని తీసెయ్'.. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై బిల్ గేట్స్ వార్నింగ్‌!

27 Oct, 13:31

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ కీలక నిర్ణయం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

27 Oct, 13:29

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct, 13:24

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48
..More Telugu News