Emirates: ఎమిరేట్స్ విమాన సేవలు పునఃప్రారంభం.. గందరగోళానికి తెర

Emirates Flights Resume Operations After Temporary Suspension
  • దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమాన సేవలు పునఃప్రారంభం
  • భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపివేసిన సర్వీసులు
  • ఇవాళ‌ మధ్యాహ్నం నుంచి కార్యకలాపాలు యథాతథం
  • విమాన వివరాలు చూసుకుని ఎయిర్‌పోర్ట్‌కు రావాలని సూచన
  • పాత పోస్ట్‌ను తొలగించి, గందరగోళాన్ని నివారించిన ఎయిర్‌లైన్స్
ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన సర్వీసులను పునఃప్రారంభించింది. భద్రతా కారణాల రీత్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టినట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' ద్వారా ప్రయాణికులకు తాజా సమాచారం అందించింది. 

ఇవాళ మధ్యాహ్నం నుంచి బుకింగ్స్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావచ్చని ఎమిరేట్స్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. దుబాయ్ మీదుగా ప్రయాణించే (ట్రాన్సిట్) ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుందని, అయితే, వారి కనెక్టింగ్ ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని నిర్ధారించుకోవాలని సూచించింది. ప్రయాణానికి ముందు తమ అధికారిక చానెళ్ల ద్వారా ఫ్లైట్ స్టేటస్, సీట్ల లభ్యతను చెక్ చేసుకోవాలని కోరింది.

అంతకుముందు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుబాయ్ నుంచి అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు, ప్రయాణికులు ఎవరూ ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని ఎమిరేట్స్ ప్రకటించింది. అయితే, ఈ పోస్ట్ ప్రయాణికులలో అనవసర గందరగోళానికి దారితీయడంతో దానిని తొలగించినట్లు సంస్థ వివరించింది.

పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే ఆపరేషనల్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని ఎమిరేట్స్ తెలిపింది. "ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ప్రయాణికుల సహనానికి ధన్యవాదాలు" అని పేర్కొంది.
Emirates
Emirates flights
Dubai International Airport
flight resumption
flight cancellation
travel advisory
flight status
aviation safety
transit flights
passenger information

More Telugu News