Harisingh Malaviya: పరీక్ష రాయడానికి వెళ్తున్న అక్కాతమ్ముళ్లను కడతేర్చిన బాబాయ్!
- దారి కాచి కర్రతో విచక్షణారహితంగా దాడి
- తీవ్ర రక్తస్రావం కారణంగా స్పాట్ లోనే మరణించిన అక్కాతమ్ముళ్లు
- కుటుంబ ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణం
హాల్ టిక్కెట్లు రక్తసిక్తమయ్యాయి..
పరీక్ష రాసేందుకు వెళ్లిన బిడ్డలు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకుని కుటుంబానికి వెలుగునిస్తారనుకున్న బిడ్డలను సొంత బాబాయే కొట్టి చంపడం కలిచివేస్తోంది. వారి హాల్‌టిక్కెట్లు రక్తంతో తడిసిపోవడం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘వాళ్లు పరీక్షకు వెళుతున్నారని అతడి(వారి బాబాయి)కి తెలుసు. ఉదయం నుంచే అక్కడ కాపుకాచి మా ఇంటి దీపాలను ఆర్పేశాడు. చదువుకుని గొప్పవాళ్లవుతారనుకుంటే.. ఇలా శవాలుగా పడి ఉన్నారు’’ అంటూ మృతుల తండ్రి జగదీశ్ మాలవీయ రోదించారు. కుటుంబ ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
పోలీసుల గాలింపు..
ఈ దారుణానికి పాల్పడిన హరిసింగ్ పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట హత్యలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య చేసి పారిపోయిన హరిసింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.