Toli Chowki Accident: టోలీచౌకిలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి కార్మికులు మృతి

Toli Chowki Accident Workers Dead After Building Collapse in Hyderabad
  • నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి నలుగురు కార్మికులు మృతి
  • మరికొందరికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
  • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్
హైదరాబాద్‌లోని టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో 10 నుండి 12 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

భవనం నిర్మాణం కోసం గోవా కర్రలతో కట్టిన పరంజా కుప్పకూలడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ప్రమాదంలోని బాధితులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా భవనం నిర్మిస్తుండటమే ఈ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, రెవెన్యూ, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డర్ పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Toli Chowki Accident
Hyderabad accident
Building collapse
Labor accident
Construction accident India
Toli Chowki
Hyderabad
Construction safety
Building collapse India
Accident news

More Telugu News