Majid Takht: ఇరాన్ అణ్వాయుధాలు వదిలేస్తుందా?... మంత్రి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అధికారిక మీడియా
- అమెరికా, ఇజ్రాయెల్‌తో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఇరాన్
- భీకర యుద్ధం సమయంలో ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కీలక ప్రకటన వచ్చినట్లు కథనాలు
- అమెరికా సంతృప్తికర ఆఫర్ ఇస్తే అణు కార్యక్రమాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించినట్లు వార్తలు
- ఈ ప్రకటనకు తాజా పరిణామంతో సంబంధం లేదని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ స్పష్టత
తమకు సంతృప్తికర ఆఫర్‌ను అమెరికా ప్రకటిస్తే తాము కూడా అణు కార్యక్రమాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి మాజిద్ తఖ్త్ ప్రకటన చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నువ్వానేనా అన్నట్లు ఢీకొంటున్న ఇరాన్ మంత్రి నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిందని కథనాలు రావడం గమనార్హం. అయితే, మంత్రి వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక మీడియా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు తాజా పరిణామానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అవి మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలని పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి అనంతరం ఆ దేశం అమెరికా, ఇజ్రాయెల్ ముందు కుదేలవుతుందని అందరూ భావించారు. కానీ ఆరు రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా దేశాల సంయుక్త దాడికి ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. అయితే అనూహ్యంగా ఇరాన్ మంత్రి అమెరికా ముందు ప్రతిపాదన ఉంచినట్లు వార్తలు రావడం గమనార్హం.
ఇరాన్ మంత్రి నుంచి ఈ ప్రకటన వెలువడిందని వార్తలు వెలువడిన నిమిషాల్లోనే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ స్పష్టతను ఇచ్చింది. విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అణు ఒప్పందంపై అమెరికాతో గతంలో జరిగిన చర్చలకు సంబంధించినవని పేర్కొంది. తాజా పరిణామంతో ఈ వ్యాఖ్యలకు సంబంధం లేదని, ఇరాన్ కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది.