ఇవి మనిషి సృష్టించిన తీవ్ర విషాదాలు: కేటీఆర్
Add ap7am to your home Screen

ఇవి మనిషి సృష్టించిన తీవ్ర విషాదాలు: కేటీఆర్

KTR Expresses Grief Over Iran School Attack
  • ఇరాన్‌లోని పాఠశాలపై మిస్సైల్ దాడిలో 165 మంది విద్యార్థినులు మృతి
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్
  • ఈ యుద్ధాలు రాబోయే తరాలకు తీరని శోకాన్ని మిగిలిస్తాయని వ్యాఖ్య

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులు తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజ్రే తయ్యెబా' బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన మిస్సైల్ దాడిలో 165 మంది విద్యార్థినులు మరణించారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా విషాదం కలిగించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


పాఠశాల శిథిలాల కింద చిక్కుకుని మరణించిన ఆ 165 మంది బాలికల సామూహిక అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేటీఆర్ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. యుద్ధం వెనుక కారణాలు ఏవైనా, ఇలాంటి మారణహోమాలు మనిషి సృష్టించిన తీవ్ర విషాదాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాలు రాబోయే తరాలకు కేవలం తీరని శోకాన్ని, వినాశనాన్ని మాత్రమే మిగుల్చుతాయని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement
KTR
K Taraka Rama Rao
Iran
Israel
America
Missile attack
School attack
Minab
War
BRS

More Telugu News