ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

Narendra Modi Talks with Oman Sultan Kuwait Prince on Phone
  • భారతీయుల భద్రతపై వారితో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడి
  • గల్ఫ్ దేశాల మీద జరుగుతున్న దాడులపై ప్రధాని ఆందోళన
  • చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న విదేశాంగ శాఖ
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజుతో ఫోన్‌లో సంభాషించారు. గల్ఫ్‌లో కొనసాగుతున్నసంఘర్షణ, ఈ ప్రాంతాల్లోని భారతీయుల భద్రతపై వారితో చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

కువైట్ యువరాజు సబా అల్ ఖలీద్ అల్ సబాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడుల మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒమన్ సుల్తాన్‌తోనూ ప్రధాని మోదీ మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను నివారించాలని కోరింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
Go Back to Shorts
Narendra Modi
Oman Sultan
Kuwait Prince
Gulf Conflict
India
Iran Israel war
Indian citizens safety

More Telugu News