AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం

AP Farmers Get Good News From Coalition Government
  • ఏపీలో పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆమోదం
  • రూ.250 కోట్ల వ్యయంతో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు
  • నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని డిస్కంలకు స్పష్టమైన గడువు
ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను కేటాయించనుంది. 

ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 1.12 లక్షల కనెక్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 46 వేల మందికి పైగా రైతులకు వ్యవసాయ పనులకు విద్యుత్ సౌకర్యం అందనుంది.
 
AP Farmers
Andhra Pradesh
Agriculture Electricity Connections
Gottipati Ravikumar
AP Government
AP New Government
Farmers Welfare
AP Discoms

More Telugu News