ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం... ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- సుప్రీం లీడర్ ఖమేనీ హత్య నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులు
- అల్లకల్లోలంగా మారిన పశ్చిమాసియా
- 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమాసియా దేశాల్లోని తెలంగాణ పౌరుల సహాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆయా దేశాల్లోని పౌరులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.
24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను అధికారులు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే - 871999044, 9958322143, 9910014749, 9643723157.