ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ!
- ఐఆర్‌జీసీకి కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ నియామకం
- దాడుల్లో పాత కమాండర్ మరణించారన్న వార్తల నేపథ్యంలో నిర్ణయం
- గతంలో రక్షణ, అంతర్గత మంత్రిగా పనిచేసిన అనుభవం
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల మధ్య కీలక పరిణామం
అహ్మద్ వాహిదీకి సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, వ్యూహరచనలో నిపుణుడైన వాహిదీ నియామకం ద్వారా సైనిక బలగాల్లో ఐక్యతను తీసుకురావాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.